వరం ఇచ్చిన శివుడినే బూడిద చేయాలనుకున్న భస్మాసురుడి గతే నీకు పడుతుందంటూ…జగన్పై చంద్రబాబు సంచలన ట్వీట్ చేశారు. వివిధ సందర్భాల్లో జగన్ ఇచ్చిన హామీల వీడియో పెట్టి చర్చకు సిద్దమా అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. బూటకపు ప్రసంగాలు కాదు.. అభివృద్ది పాలన ఎవరిదో.. విధ్వంసం ఎవరిదో జనం ముందు చర్చిద్దాం…దమ్ముంటే నాతో బహిరంగ చర్చకు రా! అంటూ సవాల్ చేశారు.
ప్లేస్, టైం.. నువ్వే చెప్పు….ఎక్కడికైనా వస్తా.. దేనిమీదైనా చర్చిస్తానని ప్రకటించారు. చర్చకు నువ్వు సిద్ధమా జగన్ రెడ్డీ! అంటూ చురకలు అంటించారు. సామాజిక న్యాయానికి నిలువునా శిలువ వేశారు….బాదుడు పాలనతో ప్రజల రక్తం పీల్చేశారని ఫైర్ అయ్యారు. విధ్వంస పోకడలతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును కూల్చేశారు…ఇప్పుడు ర్యాంప్ వాక్ చేసి అబద్ధాలు చెబితే ప్రజలెలా నమ్ముతారు జగన్ రెడ్డీ..? అంటూ ఫైర్ అయ్యారు. నీకు, నీ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ ప్రారంభమైంది.. ఇంకా 50 రోజులే అంటూ హెచ్చరించారు బాబు.