బొత్స వ్యాఖ్యలకు శ్రీనివాస్ గౌడ్ కౌంటర్..రాజధాని కూడా లేని రాష్ట్రం అది!

-

బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. రాజధాని కూడా లేని రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్‌ అంటూ విమర్శలు చేశారు. TSPSC పై బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆఫ్ట్రాల్ సర్వీస్ కమిషన్ పరీక్షలనే నిర్వహించుకోలేని పరిస్థితి తెలంగాణలో ఉందని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు బొత్స సత్య నారాయణ.

తెలంగాణ సర్వీస్ కమిషన్ పరీక్షల్లోనే ఏ రకంగా స్కాం‌లు జరిగాయో చూశామని.. అన్ని చూచిరాతలే అంటూ ఫైర్‌ అయ్యారు. అయితే.. బొత్స చేసిన వ్యాఖ్యలకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. ఆ రాష్ట్రమేంటో, మా రాష్ట్రమేంటో మాకు తెలియదా?.. రాజధాని కూడా లేని రాష్ట్రం అది అంటూ విరుచుకుపడ్డారు. బొత్స అలా మాట్లాడటం సరికాదన్నారు. గతంలో ఏపీపీఎస్సీలో ఎన్ని స్కాంలు జరిగాయో చూసుకోవాలి.. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని హెచ్చరించారు మంత్రి శ్రీనివాస్ గౌడ్.

Read more RELATED
Recommended to you

Latest news