బ్రేకింగ్: హైదరాబాదులో ఎవరు ఇళ్ల నుంచి బయటకు రావద్దు జిహెచ్ఎంసి వార్నింగ్

హైదరాబాద్ ని భారీ వర్షాలు వదలడం లేదు. నిన్న భారీ వర్షంతో హైదరాబాద్ వాసులు అందరూ తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. నేడు మరోసారి భారీ వర్ష హెచ్చరిక చేసింది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్. న‌గరంలో రాబోయే మూడు గంట‌ల పాటు భారీ నుండి అతి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉందని… జిహెచ్ఎంసి క‌మిష‌న‌ర్ డి.ఎస్‌.లోకేష్ కుమార్‌ వెల్లడించారు.

rain
rain

ప్ర‌జ‌లు ఎవరు ఇళ్ల నుంచి బయటకు రావద్దని జిహెచ్ఎంసి కమిషనర్ సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని లోకేష్ కుమార్ హెచ్చరించారు. డి.ఆర్‌.ఎఫ్, మాన్సూన్ ఎమ‌ర్జెన్సీ టీమ్‌లు, అధికారుల‌ను అప్ర‌మ‌త్తం చేశామని ఆయన అన్నారు. అత్య‌వ‌స‌ర స‌హాయానికై జిహెచ్ఎంసి టోల్ ఫ్రీ నెం: 040-21111111 లేదా 040-29555500 నెంబ‌ర్ల‌ను సంప్ర‌దించ‌వ‌చ్చని సూచించారు.