హైదరాబాద్ లో బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్ గారెత్ విన్ ఓవెన్.. ఎమ్మెల్సీ కవితను కలిశారు. ఎమ్మెల్సీ కవిత ఇంటికి వచ్చిన బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్ గారెత్ విన్ ఓవెన్… హైదరాబాద్ లోని కవిత నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా గారెత్ ఓవెన్ కు శుభాకాంక్షలు తెలిపారు కవిత. అనంతరం.. వారు 50 నిమిషాల పాటు భేటీ అయి.. పలు అంశాలపై చర్చించారు. ఈ భేటీకి సంబంధించిన ఫోటోలను స్వయంగా కవిత గారే తమ ట్విట్టర్ లో షేర్ చేశారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో అభివృద్ధి, అభివృద్ధి అవకాశాలతో పాటు, పలు అంశాలపై విస్తృతంగా చర్చించినట్లు ఎమ్మెల్సీ కవిత తెలిపారు.
I extend my best wishes to @UKinHyderabad , British Deputy High Commissioner for his courteous visit earlier today.
We had fruitful conversations and deliberations on wide range of topics including the prospects of growth and development in Telangana under CM KCR Garu. pic.twitter.com/w5AYjQJ7n5
— Kavitha Kalvakuntla (@RaoKavitha) September 26, 2022