వెన్నుపోటు రాజకీయం..ఎవరికి వారే..!

-

రాజకీయాల్లో వెన్నుపోటు అనేది సర్వ సాధారణమైపోయింది. ఒకే పార్టీలో ఒకరికొకరు వెన్నుపోటు పొడుచుకోవడం నేతలకు అలవాటు అయిపోయింది. కాకపోతే వెన్నుపోటు అంటే రాజకీయ ప్రత్యర్ధులకు చంద్రబాబు పేరు మాత్రమే గుర్తొస్తుంది. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి టీడీపీని చంద్రబాబు లాక్కున్నారని ప్రత్యర్ధులు ఇప్పటికీ విమర్శలు చేస్తూ ఉంటారు. అయితే ఇది ఎప్పుడో 25 ఏళ్ల క్రితం జరిగింది..అది కూడా టీడీపీని బాబు లాక్కోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. దానికి ప్రత్యర్ధులు వెన్నుపోటు అని పేరు పెట్టారు.

అయితే ఈ కామెంట్స్ చంద్రబాబుపై ఎప్పుడు చేస్తూనే ఉంటారు. కానీ ప్రజలు అవి పెద్ద పట్టించుకోరు.. నాయకులు మాత్రం వెన్నుపోటుని వదలరు. తాజాగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరుని వైఎస్సార్‌గా జగన్ ప్రభుత్వం మార్చింది.. దీనిపై టీడీపీ భగ్గుమంటుంది. అటు నందమూరి ఫ్యామిలీ కూడా తప్పుబట్టింది. ఇదే క్రమంలో బాలయ్య.. వైసీపీపై విరుచుకుపడిన విషయం తెలిసిందే. దీనికి వైసీపీ కూడా కౌంటర్లు ఇస్తుంది. పేరు మార్చిన విషయం వదిలేసి.. ఎన్టీఆర్‌కు బాబు వెన్నుపోటు పొడిచారని, అందులో బాలయ్య పాత్ర ఉందని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు.

ఇదే క్రమంలో వైసీపీకి కౌంటరుగా టీడీపీ కూడా విరుచుకుపడుతుంది. కాంగ్రెస్‌కు జగన్ వెన్నుపోటు పొడిచారని, అలాగే ‘పేటీఎం డాగ్స్! దిస్ ఈజ్ రియల్ వెన్నుపోటు’ అని నారా లోకేష్ పేర్కొన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఉండవల్లి అరుణ్ కుమార్ ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూ క్లిప్లింగ్‌ను షేర్ చూస్తూ నారా లోకేష్ ట్వీట్ చేశారు. అందులో ఉండవల్లి అరుణ్ కుమార్ వైఎస్సార్‌ను ప్రథమ ముద్దాయిని చేసింది స్వయంగా ఆయన కుమారుడేనని తెలిపారు. సుప్రీంకోర్టు వరకు వెళ్లి అవినీతి కేసుల్లో వైఎస్సార్ ని ముద్దాయిని చేసింది దుర్మార్గపు కొడుకు జగన్ రెడ్డి అంటూ లోకేష్ ట్వీట్ చేశారు. మొత్తానికి ఈ విధంగా రెండు పార్టీలు ప్రజా సమస్యలు వదిలేసి.. వెన్నుపోటు రాజకీయం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news