రాహుల్ గాంధీపై ఈసీకి బీఆర్ఎస్ ఫిర్యాదు

-

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ పార్టీ ఫిర్యాదు చేసింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎలాంటి ఆధారాలు లేకుండా మాట్లాడిన ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరింది. రాహుల్‌పైన విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని కోరిన బీఆర్ఎస్ ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా చర్యలు తీసుకోవాలని విఙ్ఞప్తి చేసింది.

తుక్కుగూడ సభలో ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండా దురుద్దేశపూర్వకంగా టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ తమ పార్టీపై ముఖ్యంగా, పార్టీ అధ్యక్షులు కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యల విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని ఈసీకి బీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. రాహుల్ గాంధీ అబద్ధాలు, అసత్యాలను మాట్లాడుతూ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని పేర్కొంది. రాహుల్ వ్యాఖ్యల  వీడియోలను ఫిర్యాదుకు జతపరిచిన ఆ పార్టీ.. తక్షణమే రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ పార్టీపై కూడా తగిన చర్యలు తీసుకోవాలని విన్నవించింది. ఇదే ఫోన్ ట్యాపింగ్ అంశంలో అడ్డగోలుగా మాట్లాడారంటూ మంత్రి కొండా సురేఖపై కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి మరో ఫిర్యాదు చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news