రూ.2లక్షల రుణమాఫీ పై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన

-

కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో రైతులకు హామీ ఇచ్చినట్లుగా రూ.2 లక్షల రుణమాఫీ అమలు ప్రాసెస్ను మొదలుపెట్టింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన శుక్రవారం జరిగిన కేబినెట్ భేటీలో రుణమాఫీకి మంత్రి మండలి సైతం ఆమోదం తెలిపింది. ఏకకాలంలో రూ.2 లక్షలు రుణ మాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆదేశాలతో అధికారులు నిధుల సమీకరణ, అర్హుల గుర్తింపు. రుణమాఫీ విధివిధానాలపై రూపకల్పనపై కసరత్తు మొదలు పెట్టారు. అయితే, ఆగస్ట్ 15 లోపు రెండు లక్షల రుణమాఫీ చేసి తీరుతామని సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు పలువురు కాంగ్రెస్ నేతలు ఛాలెంజ్లు చేశారు. మాఫీ అమలుకు డెడ్ లైన్ ఎప్పుడో చెప్పినప్పటికీ.. అసలు రుణమాఫీ ప్రక్రియను ఎప్పుటి నుండి మొదలు పెడతారని రైతుల్లో సందేహం నెలకొంది.

ఈ క్రమంలో రెండు లక్షల రుణ మాఫీ అమలు ప్రక్రియ ఎప్పుటి నుండి మొదలు అవుతుందనే దానిపై మంత్రి పొంగులేటి క్లారిటీ ఇచ్చారు. శనివారం ఖమ్మంలో పొంగులేటి ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. వచ్చే నెల  నుంచి రైతులకు రుణమాఫీ ప్రక్రియ ప్రారంభిస్తామని తెలిపారు. హామీ ఇచ్చినట్లుగా రూ.31 వేల కోట్ల రైతుల రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించారు. పేదలకు ఇచ్చిన హామీల అమలుపై వెనకడుగు వేసేది లేదని తేల్చి చెప్పారు. రుణమాఫీ చేయడాన్ని విపక్షాలు తట్టుకోలేకపోతున్నాయని ఎద్దేవా చేశారు. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news