ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి మాటలు వింటే రాష్ట్రానికి మేలు చేస్తున్నాడా కీడు చేస్తున్నాడా అర్థం కావడం లేదు అని అన్నారు హరీష్ రావు. రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉండి రాష్ట్ర ప్రయోజనాలు పణంగా పెట్టి సీఎం మాట్లాడుతున్నాడు. ఉమ్మడి రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇలా మాట్లాడి ఉండకపోవచ్చు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడపడమంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం కాదు. 16వ ఆర్థిక సంఘాన్ని కూడా సీఎం రేవంత్ తప్పుదోవ పట్టించే యత్నం చేశాడు. కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాల పునాధుల పైన ఏర్పడ్డది.
అసెంబ్లీలో 6.85 లక్షల కోట్లు అప్పు ఉన్నట్టు శ్వేతపత్రం విడుదల చేశారు. అందులో మార్చి 2024 వరకు కాంగ్రెస్ తీసుకుబోయే అప్పులను కూడా కలిపి చెప్పారు. గ్లోబెల్స్ ని మించిపోయి రేవంత్ రెడ్డి అబద్ధాలు చెబుతున్నాడు. పదేళ్ల BRS పాలనలో 4.26 లక్షల కోట్లు మాత్రమే. సీఎం రేవంత్ ఒక్కరోజు తెలంగాణ కోసం పోరాడలేదు. కాంగ్రెస్ లో ఉన్నోళ్లు ఒక్కరోజు తెలంగాణ కోసం కొట్లాడినోళ్ళు కాదు. 2013-14 లో తెలంగాణ తలసరి ఆదాయం1,12,162 రూపాయలు.నేడు 3,47,269 తలసరి ఆదాయంతో తెలంగాణ నంబర్ 1లో ఉంది. మేము చేసిన మంచి పనులను సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం లేదు అని అన్నారు హరీష్ రావు.