హైదరాబాద్ లో అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే ఓ మహిళా కార్పొరేటర్ తో అసభ్యకరంగా మాట్లాడినట్లు ఆడియోలు బయటికి వచ్చాయి. ఆ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సదరు కార్పొరేటర్ తో కలిసి కొంతకాలంగా అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. దీనిని అవకాశంగా తీసుకుని కాల్ చేశాడని తెలుస్తోంది.
రాత్రివేళ ఆమెకు ఫోన్ చేసి… తిన్నావా… లేదా… ఇంత రాత్రి వరకు తినకపోతే ఆరోగ్యం ఏమవుతుందని మాటలు కలిపాడు. కొంత సమయం తర్వాత అసభ్యకరంగా మాట్లాడటంతో కార్పొరేటర్ ఒక్కసారిగా షాక్ అయ్యారు. కాల్ రికార్డింగ్ చేసి పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. అలాగే ఓ మంత్రికి కూడా పంపినట్టు తెలుస్తుంది. సదరు ప్రజాప్రతినిధిపై చర్యలు తీసుకుంటామని అధిష్టానం హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.