గన్ పార్క్ వద్దకు బీఆర్.ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వచ్చారు. ఈ సందర్భంగా గన్ పార్క్ అమరవీరుల స్థూపం వద్ద దివంగత మాజీ ఎమ్మెల్యే లాస్య నందిత కు సంతాపం తెలిపారు బీఆర్.ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. ఇందులో మాజీ మంత్రి హరీష్ రావు, కేటీఆర్ తో పాటు బీఆర్.ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవా లక్ష్మీ మాట్లాడుతూ….సర్పంచుల పదవీకాలం ముగిసినా వారికి బిల్లులు రాలేదని ఆగ్రహించారు. మన ఊరు మన బడి ద్వారా చేసిన పనులకు బిల్లులు ఆపారని మండిపడ్డారు. చిన్న కాంట్రాక్టర్లు, సర్పంచులు ఇబ్బందులు పడుతున్నారు..తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి గ్రామ పంచాయతీల పట్ల చిత్తశుద్ధి లేకుండా పోయిందని నిప్పులు చెరిగారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా లేదా అనే పరిస్థితి నెలకొంది..గ్రామ పంచాయతీల్లో పారిశుద్ధ్యం లోపించిందన్నారు.