శ్రీధర్‌బాబు తెలంగాణ ముఖ్యమంత్రి అవుతారనుకున్నా: ఎమ్మెల్సీ భానుప్రసాద్

-

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ భాను ప్రసాద్ ఆసక్తికర వాక్యాలు చేశారు. ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ….’మన పెద్దపల్లి ప్రాంతానికి చెందిన శ్రీధర్ బాబు సీఎం అవుతారనే ఆశ ఉండేది. ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా సీఎం అయ్యే అవకాశం ఆయనకు ఉంది. ప్రస్తుతం ఆయన ఐటీ శాఖ మంత్రిగా ఉన్నారు. కాబట్టి పెద్దపల్లి జిల్లాలో ఐటీ, పారిశ్రామిక అభివృద్ధికి కృషి చేస్తారనే నమ్మకం నాకుంది’ అని పేర్కొన్నారు.

BRS MLC-bhanu-prasad comments on sridhar babu

ఇక అంతకు ముందు పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మ్యూజియం గ్రంథాలయాన్ని మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ గ్రంథాలయ విశిష్టతను మంత్రికి వివరించారు. ఈ మ్యూజియంలో చారిత్రక వారసత్వ సంపద, శిలాజాలు, నాణేలు, దర్శనీయ ప్రాంతాలను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో ఎక్కడలేని విధంగా మ్యూజియం గ్రంథాలయం ఏర్పాటు చేయడం అభినందనీయమని మంత్రి తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news