ఎమ్మెల్సీ కవిత అరెస్ట్.. మరికాసేపట్లో ఢిల్లీకి తరలింపు..!

-

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్ అయ్యారు. ఇవాళ ఢిల్లీ నుండి వచ్చిన ఐటీ, ఈడీ అధికారుల బృందం హైదరాబాద్లోని ఆమె ఇంట్లో ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. దాదాపు 4 గంటల పాటు అధికారులు ఎమ్మెల్సీని విచారించారు. అనంతరం కోర్టు అనుమతితో కవితకు ఈడీ అధికారులు అరెస్ట్ నోటీసులు ఇచ్చి అదుపులోకి తీసుకున్నారు. తనిఖీల్లో భాగంగా కవితతో పాటు ఆమె భర్త అనిల్ కుమార్, సిబ్బంది మొబైల్ ఫోన్లన్నింటినీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. ఎంపీ ఎన్నికల వేళ బీఆర్ఎస్కు వరుస షాకు తగులుతున్నాయి. ఓ వైపు కీలక నేతలు పార్టీని వీడుతుండగా కవిత అరెస్ట్ కావడం గులాబీ నేతల్లో కలవరం మొదలైంది. అరెస్ట్ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలు కవిత నివాసానికి చేరుకుంటున్నారు. దీంతో ఆమె నివాసం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎంపీ ఎన్నికల వేళ కవిత ఇంట్లో సోదాలు చేయడం, అరెస్ట్ చేయడంపై బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమంటున్నాయి. ఎన్నికల్లో కేసీఆర్ను ఎదుర్కొలేక బీజేపీ భయపడి ఈడీ, ఐటీలను ప్రయోగిస్తోందని మండిపడుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news