కవితకు మరోసారి షాక్.. జులై 25వరకు జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు

-

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు దిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు మరోసారి షాక్ ఇచ్చింది. దిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో ఈడీ కేసులో కవితకు జ్యుడీషియల్ కస్టడీ మరోసారి పొడిగించింది. కవితతో పాటు దిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోదియా కస్టడీని జులై 25 వరకు పొడిగించింది. ఈడీ కేసులో కవిత, సిసోదియా జ్యుడీషియల్ కస్టడీ ఇవాళ్టితో ముగియడంతో వారిద్దరిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులు కోర్టు ముందు హాజరు పరిచారు. ఈ నేపథ్యంలో విచారణను జులై 25కు వాయిదా వేసిన రౌస్‌ అవెన్యూ కోర్టు అప్పటి వరకు కస్టడీ పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

దిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టయిన కవిత ఇటీవలే బెయిల్‌ కోరుతూ దాఖలు చేసిన రెండు వేర్వేరు పిటిషన్లను దిల్లీ హైకోర్టు తిరస్కరించింది. సీబీఐ, ఈడీ తనపై నమోదు చేసిన కేసుల్లో బెయిల్‌ మంజూరు చేయాలంటూ ఆమె దిల్లీ కోర్టును ఆశ్రయించగా.. ప్రస్తుతం దిల్లీ మద్యం కేసు కీలక దశలో కొనసాగుతున్న సమయంలో ఆమెకు బెయిల్‌ మంజూరు చేస్తే సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశం ఉందని ఈడీ, సీబీఐ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలో దిల్లీ హైకోర్టు కవిత బెయిల్ పిటిషన్లు తిరస్కరించింది.

Read more RELATED
Recommended to you

Latest news