సిరిసిల్లలో మరో నేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత 12 మంది నేత కార్మికుల ఆత్మహత్య జరిగాయి.సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని బి వై నగర్ కి చెందిన నేతన్న పల్లె యాదగిరి (సైజింగ్ కార్మికుడు) ఉపాధి లేక నిన్న రాత్రి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
బి. వై నగర్ కు చెందిన పల్లే యాదగిరి గౌడ్ కు భార్య మంజుల, ఇద్దరు కూతుర్లు వున్నారు. గత ఆరునెలలుగా డయింగ్ వర్క్ లేకపోవడంతో ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.
మొన్న అప్పుల బాధతోనే… ముదిగొండ నరేష్(35) నేత కార్మికుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని స్థానికులు కూడా చెబుతున్నారు. కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత సిరిసిల్లాలో నేతన్నల ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇవ్వక పోవడంతో.. నేతన్నలకు ఉపాధి దొరకడం లేదు. దీంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.