బీఆర్ఎస్ పార్టీ టైటానిక్ పడవలాంటిది.. రఘునందన్ రావు సెటైర్..!

-

తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు చాలా రసవత్తరంగా మారాయి. అధికార కాంగ్రెస్ ఇప్పటికే కొంత మంది అభ్యర్థులను ప్రకటించింది. ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలు కూడా తమ అభ్యర్థులను ప్రకటించాయి. కొన్ని చోట్ల పార్టీలకు చెందిన అభ్యర్థులు మారే అవకాశం కనిపిస్తోంది. తాజాగా బీఆర్ఎస్ కి చెందిన కేకే, హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మీ, కడియం శ్రీహరి, కడియం కావ్య, ఇంద్రకరణ్ రెడ్డి తదితర నాయకులు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరనున్నారు. 

ఈ నేపథ్యంలో ఇప్పటికే వరంగల్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా కడియం కావ్య పేరును ప్రకటించారు. అయితే కడియం కావ్య తాను బీఆర్ఎస్ తరపున పోటీ చేయడం లేదని ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ మునిగిపోయే నావా అని అన్నారు. ఎప్పుడు మునిగిపోతుందో తెలియని పరిస్థితి ఆ పార్టీలో నెలకొందని విమర్శించారు. కొట్లాడి టికెట్లు తెచ్చుకోవాల్సిన పరిస్థితి నుంచి ఇచ్చిన టికెట్లను కూడా కాదనుకొని కారు దిగి వెళ్లిపోతున్నారంటేనే ఆ పార్టీ ఓటమి ఖాయమని అర్ధం చేసుకోవాలని అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి ఒక్క అభ్యర్థి కూడా గెలవడు అని తెల్చి చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ మధ్యే ప్రధాన పోటీ ఉంటుందని  తెలిపారు. 

Read more RELATED
Recommended to you

Latest news