తెలంగాణలో మరణించిన 209 రైతుల వివరాలు బయటపెట్టిన బీఆర్‌ఎస్‌ !

-

తెలంగాణలో మరణించిన 209 రైతుల వివరాలు బయటపెట్టింది బీఆర్‌ఎస్‌. తెలంగాణలో మరణించిన 209 రైతుల వివరాలు తనకు ఇవ్వాలని సీఎం రేవంత్‌ నిన్న పేర్కొన్నారు. అయితే.. రేవంత్‌ వ్యాఖ్యలకు కౌంటర్‌ గా తెలంగాణలో మరణించిన 209 రైతుల వివరాలు బయటపెట్టింది బీఆర్‌ఎస్‌.

Today KCR to Nalgonda Revanth to Medigadda

రేవంత్ రెడ్డి గారు.. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేశాక.. సమయానికి రైతుబంధు అందక, సాగునీళ్లు ఇవ్వక, కరెంట్ కోతలతో, అర్థరాత్రి బోరు మోటార్లు ఆన్ చేయడానికి వెళ్లి కరెంట్ షాక్‌తో, పాము కాట్లతో మరియు అధికారుల వేధింపులతో మరణించిన 209 రైతుల వివరాలు ఈ మీడియా సంస్థ బయటపెట్టిందని పోస్ట్‌ పెట్టింది బీఆర్‌ఎస్‌ పార్టీ.

ఈరోజు మీరు ఇచ్చిన మాట ప్రకారం.. దురదృష్టవశాత్తు మరణించిన ఈ 209 రైతుల యొక్క కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం తరుపున ఆదుకోవాలని కోరుతున్నామని తెలిపింది. ఒక్కో రైతు కుటుంబానికి కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 20 లక్షల ఆర్ధిక సహాయం చేయాలని బీఆర్ఎస్ పార్టీ తరుపున డిమాండ్ చేస్తున్నామని వివరించింది.

https://x.com/BRSparty/status/1775168050318496120?s=20

Read more RELATED
Recommended to you

Latest news