దళిత మాజీ మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడు ముదం సాయిలు ఇంట్లో భోజనం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అంబేడ్కర్ జయంతి రోజున దళిత మాజీ మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడు ముదం సాయిలును పోలీసులు అవమానించిన నైపథ్యంలో ఆత్మగౌరవ గర్జన కార్యక్రమానికి ఏర్పాటు చేసి అతన్ని సత్కరించారు కేటీఆర్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, వేముల ప్రశాంత్ రెడ్డి మరియు ఇతర బీఆర్ఎస్ నాయకులు. ఈ సందర్బంగా ముదం సాయిలు ఇంట్లో భోజనం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.

సందర్బంగా కేటీఆర్ మాట్లాడారు. రేవంత్ రెడ్డి మిస్ వరల్డ్ పోటీదారులకు లక్షలు ఖర్చు చేసి భోజనం పెట్టిండు కానీ మన గురుకుల విద్యార్థులకు మంచి భోజనం పెట్టడం చేతనైతలేదని మండిపడ్డారు కేటీఆర్. దళిత నాయకుడు సాయిలు బట్టలిప్పి అవమానించినట్టు.. రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు కాంగ్రెస్ పార్టీ బట్టలు ఇప్పి బుద్ధి చెప్పాలని కోరారు కేటీఆర్.
దళిత మాజీ మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడు ముదం సాయిలు ఇంట్లో భోజనం చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ https://t.co/Y0iZh2zBPf pic.twitter.com/YHwZ3GX1fx
— Telugu Scribe (@TeluguScribe) July 25, 2025