పొంగులేటి శ్రీనివాస్ నివాసంలో ఈడీ, ఐటీ సోదాలు

-

కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ఖమ్మంలోని ఆయన ఇల్లు, కార్యాలయంలో ఏకకాలంలో ఐటీ అధికారులు తనిఖీ చేస్తున్నారు. ఇవాళ తెల్లవారుజామున 3 గంటల నుంచి సోదాలు కొనసాగుతున్నాయి. ఎనిమిది వాహనాల్లో పొంగులేటి ఇంటికెళ్లిన ఐటీ అధికారులు.. మూకుమ్మడిగా ఇంట్లోకి ప్రవేశించారు. అకస్మాత్తుగా అధికారులు ఇంట్లోకి రావడంతో పొంగులేటి కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. ఏం జరుగుతుందో అర్థమయ్యేలోగానే.. వారి నుంచి అధికారులు మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఇంట్లో సోదాలు నిర్వహించారు.

మరోవైపు హైదరాబాద్‌లోని పొంగులేటి నివాసంలోనూ ఐటీ తనిఖీలు జరుగుతున్నాయి. నగరంలోని జూబ్లీహిల్స్‌ నందగిరిహిల్స్‌ నివాసంలో ఐటీ తనిఖీలు కొనసాగుతున్నారు. పాలేరు నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీచేస్తున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. నేడు నామినేషన్‌ వేసేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఇవాళ ఐటీ దాడులు జరగడం రాష్ట్రంలో చర్చనీయాంశమవుతోంది.

అయితే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన నేతలను ఇబ్బంది పెట్టేందుకు బీఆర్ఎస్, బీజేపీలు కలిసి ఐటీ దాడులు చేయాలని ప్లాన్ చేస్తున్నాయని పొంగులేటి చెప్పిన మరుసటి రోజే తనిఖీలు జరుగుతుండటం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Latest news