నేటి నుంచే బ‌డ్జెట్ స‌మావేశాలు.. ప్ర‌జా సంక్షేమానికే భారీ నిధులు

-

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స‌మావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. మొద‌టి రోజే.. 2022 – 23 ఆర్థిక సంవ‌త్సరానికి సంబంధించిన బ‌డ్జెట్ ను రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌వేశ పెట్ట‌నుంది. కాగ గ‌త ఏడాది అక్టోబ‌ర్ లో జ‌రిగిన అసెంబ్లీ స‌మావేశాల‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం కొన‌సాగిస్తుంది. గ‌త అక్టొబ‌ర్ నెల‌లో అసెంబ్లీ స‌మావేశాల‌ను ప్రొరోగ్ చేయ‌లేదు. దీంతో ఈ స‌మావేశాలు కొన‌సాగింపు గానే ఉన్నాయి. దీంతో గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం లేకుండానే అసెంబ్లీ స‌మావేశాలు జ‌ర‌గ‌నున్నాయి.

telangana-assembly

కాగ గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం లేక పోవ‌డం పై విప‌క్ష పార్టీలు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నాయి.కానీ రాష్ట్ర ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యంలో వెన‌క‌డుగు వేయ‌డం లేదు. కాగ ఈ సారి బ‌డ్జెట్ ను ప్ర‌జా సంక్షేమానికి ఎక్కువ నిధులు కేటాయించేలా ఉంటుంద‌ని తెలుస్తోంది. సీఎం కేసీఆర్ జాతీయ రాజ‌కీయాల్లోకి అడుగు పెడుతున్న సంద‌ర్భంలో బ‌డ్జెట్ స‌మావేశాలు వ‌స్తున్న నేప‌థ్యంలో.. అంద‌రి చూపు ఈ బ‌డ్జెట్ పైనే ఉంది.

కాగ ఈ రోజు ఉద‌యం 11 : 30 గంట‌ల‌కు అసెంబ్లీ, మండ‌లి స‌మావేశం అవుతాయి. మొద‌టి రోజే అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి హ‌రీశ్ రావు బ‌డ్జెట్ ప్ర‌వేశ పెడుతారు. అలాగే మండ‌లిలో శాస‌న స‌భా వ్య‌వ‌హారాల శాఖ మంత్రి వేముల ప్ర‌శాంత్ రెడ్డి బ‌డ్జెట్ ను ప్ర‌వేశ పెడుతారు.

Read more RELATED
Recommended to you

Latest news