ఎమ్మెల్యేలకు ఎర కేసు.. వివరాల కోసం సీఎస్‌కు సీబీఐ ఆరవ లేఖ

-

దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర కేసులో దర్యాప్తు చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్న సీబీఐకి అడుగడుగునా అడ్డంకులే ఎదురవుతున్నాయి. ఈ కేసులో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసేందకు సీబీఐ సిద్ధమవుతోంది. హైకోర్టు ఆదేశాల మేరకు ఎమ్మెల్యేలకు ఎర కేసుకు సంబంధించి వివరాలు ఇవ్వాలని సీఎస్‌కు సీబీఐ అధికారులు లేఖ రాశారు. మొయినాబాద్‌ పీఎస్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌ వివరాలు ఇవ్వాలని సీబీఐ కోరింది.

ఎమ్మెల్యేలకు ఎర కేసును సిట్‌ నుంచి సీబీఐకి బదిలీ చేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ సీజే ధర్మాసనంలో ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేయగా.. ప్రభుత్వం వేసిన పిటిషన్‌ తమ పరిధిలోకి రాదని సీజే ధర్మాసనం స్పష్టం చేసింది. ఎమ్మెల్యేలకు ఎర కేసు వివరాలు ఇవ్వాలని కోరుతూ సీబీఐ అధికారులు డిసెంబరు 31, జనవరి 5, 9, 11, 26 తేదీల్లో లేఖలు రాశారు. తాజాగా రెండ్రోజుల క్రితం సీబీఐ ఎస్పీ.. సీఎస్‌ శాంతికుమారికి లేఖ రాశారు. కేసు దర్యాప్తు బాధ్యతను.. దిల్లీ విభాగానికి సీబీఐ డైరెక్టర్‌ అప్పగించారు.

Read more RELATED
Recommended to you

Latest news