తెలంగాణ అప్పులకు కేంద్రం నో పర్మిషన్ !

-

తెలంగాణ ప్రభుత్వం అప్పులకు అనుమతి నిరాకరించింది కేంద్ర ప్రభుత్వం.మొదటి మూడు నెలల్లో ఆర్బీఐ నుంచి రూ.15 వేల కోట్ల అప్పు తెచ్చి పరిస్థితుల్ని చక్కబెడదాం అనుకున్న తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఏప్రిల్ నెలలో రూ. 5 వేల కోట్ల అప్పు కోసం ప్రయత్నం చేసింది.కానీ ఫలితం లభించలేదు.కేంద్రం ఎలాంటి అప్పులు ఇవ్వలేదు.దీంతో అవసరాల్ని..చెల్లింపుల్ని వాయిదా వేసుకోవాల్సి వచ్చింది.తెలంగాణ ప్రభుత్వం పూర్తి స్థాయిలో కసరత్తు చేసి..తమ అప్పులు, గ్యారంటీలు, కార్పొరేషన్ల అప్పుల వివరాలన్నింటినీ కేంద్రానికి పంపింది.

అయితే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎఫ్ ఆర్ బి ఎం లిమిట్స్ దాటేసింది అన్న అభిప్రాయం ఉంది.దీంతో రుణ పరిమితి లో కోత విధిస్తారని..అందుకే ఇంకా అనుమతి ఇవ్వడం లేదని చెబుతున్నారు.ఈ పరిస్థితి ఏపీకి ఇంకా దారుణంగా ఉంది.తీసుకున్న అప్పుల వివరాలన్నీ చెబితే కేంద్రం ఈ ఏడాది అసలు అప్పులు తీసుకునేందుకు పర్మిషన్ ఇవ్వదన్న ఆందోళన వారిలో కనిపిస్తోంది.మొత్తంగా తెలుగు రాష్ట్రాలకు ఇప్పుడు అప్పులు రాకపోతే ఏంటి అనే పరిస్థితి ఏర్పడింది.ఈ విషయంలో వారు ఎలా ముందడుగు వేస్తారో కానీ..కేంద్రం కరుణించక పోతే మాత్రం ఆర్థిక కష్టాలు తప్పవని భావిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news