ఫ్యాక్ట్ చెక్: పీఎం మోదీ క్రికెట్ ఆడిన వీడియో వైరల్… ఇంతకీ నిజం ఏమిటి..?

-

తరచూ మనకి సోషల్ మీడియా లో ఏదో ఒక ఫేక్ వార్త కనపడుతూనే ఉంటుంది. నిజానికి ఇలాంటివి నమ్మొద్దు అని సోషల్ మీడియా లో తెగ ప్రచారం చేస్తూ ఉంటారు. ఫేక్ వార్తలు వల్ల మనమే నష్ట పోవాల్సి ఉంటుంది. స్కీములు మొదలు ఉద్యోగాల వరకూ చాలా ఫేక్ వార్తలను మనం చూస్తూనే ఉంటాం. ఇక ఇది ఇలా ఉంటే ఒక పెద్ద ఆయన క్రికెట్ ఆడుతున్నారు.

ఆ వీడియో లో ఉన్నది ప్రధాని నరేంద్ర మోడీ అని ఆయన బ్యాటింగ్ చేస్తున్నారని ఇంటర్నెట్ లో వార్త షికార్లు కొడుతోంది. అయితే ఇంతకీ అసలు వీడియో లో ఏముంది అన్నది చూస్తే.. ఈ వీడియో లో ఒక పెద్ద ఆయన తెల్ల కుర్తా వేసుకుని బ్లూ స్వెటర్ వేసుకున్నారు. క్రికెట్ బ్యాట్ ని పట్టుకుని క్రికెట్ ఆడడాన్ని మనం చూడొచ్చు. అయితే నరేంద్ర మోడీ క్రికెట్ ఆడుతున్నారు అని సోషల్ మీడియా లో వార్త విపరీతంగా వైరల్ అవుతోంది.

అయితే ఇంతకీ ఈ వార్త లో నిజం ఎంత అనేది చూస్తే… ఈ పెద్దాయన ప్రధాని నరేంద్ర మోడీ కాదని యోగరాజ్ సింగ్ యువరాజ్ సింగ్ వాళ్ళ నాన్న గారు అని తెలుస్తోంది. డిఏవి కాలేజ్ వాళ్లకి కోచింగ్ ఇస్తున్న సమయం లో ఫోటో అది. కోచ్ కింద యోగరాజ్ సింగ్ వ్యవహరించారు. 40 వ సారి ఆ కాలేజీ గెలిచింది. దీంతో ఆ వీడియో లో ఉన్నది ప్రధాని నరేంద్ర మోడీ కాదని యోగరాజ్ సింగ్ అని తెలుస్తోంది. ఇది నిజమైన వార్త కాదు కేవలం ఫేక్ వార్త మాత్రమే.

 

Read more RELATED
Recommended to you

Latest news