భారీగా పెరిగిన ఏపీ, తెలంగాణ అప్పులు.. ఈ ఐదేళ్లలో 94.75 శాతం పెరుగుదల !

-

ఏపీ, తెలంగాణ అప్పులు తడిసి మోపెడయ్యాయి. గడిచిన ఐదేళ్లలో ‘లక్షన్నర కోట్లు’ పెరిగాయని కేంద్రం ప్రకటించింది. బారాస ఎంపీలు వెంకటేష్‌నేత, రంజిత్‌ రెడ్డి, కవిత తెలంగాణ అప్పులపై అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో పేర్కొంది కేంద్ర ఆర్ధిక శాఖ. తెలంగాణ అప్పుల విషయానికి వస్తే, 2018లో రూ. 1,60,296.3 కోట్లు చేశారని, అదే 2022 నాటికి రూ. 3,12,191.3 కోట్లకు చేరాయని వివరించింది.

ఐదేళ్లలో రాష్ట్ర అప్పులు 94.75 శాతం పెరిగినట్లు పేర్కొన్న కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖ…2017-18లోనే… 95.9 శాతం అప్పులు నమోదు చేసినట్లు తెలిపింది. 2017-18లో… గతంతో పోలిస్తే 18.7 శాతం అప్పులు ఉంటే… 2021-22నాటికి 16.7 శాతం ఉన్నట్లు స్పష్టం చేసింది ఆర్ధిక శాఖ. రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తిలోనూ గత మూడేళ్లుగా అప్పుల శాతం పెరుగుతూ పోతోందన్న కేంద్రం…2022 నాటికి తెలంగాణ రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తిలో 27.4 శాతం అప్పులు నమోదు చేసినట్లు పేర్కొంది. అటు ఏపీ అప్పుల విషయానికి వస్తే, 2018లో 2 లక్షల 29వేల కోట్లు చేశారని, అదే 2022 నాటికి 3 లక్షల 98 వేల కోట్లకు చేరాయని వివరించింది.

Read more RELATED
Recommended to you

Latest news