వచ్చే 3వ తేదీన తెలంగాణకు కేంద్ర ఎన్నికల సంఘం

-

 

3న కేంద్ర ఎన్నికల సంఘం బృందం రాక త్వరలో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయా ఏర్పాట్లను పరిశీలించేందుకు 17 మందితో కూడిన కేంద్ర ఎన్నికల సంఘం బృందం హైదరాబాద్ నగరానికి రానుంది. వచ్చేనెల 3 నుంచి 5వ తేదీ వరకు విస్తృత స్థాయిలో సమీక్షలు నిర్వహించనుంది. ఇందుకు సంబంధించిన వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారికి పంపింది.

మూడవ తేదీ ఉదయం తెలంగాణ రాష్ట్ర ఎన్నికల అధికారులతో, మధ్యాహ్నం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో, సాయంత్రం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీల అధికారులతో సమావేశం అవుతారు. 4న జిల్లా ఎన్నికల అధికారులైన కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లతో జిల్లాల వారీగా సమీక్షిస్తారు. 5న ఓటర్ల చైతన్యం కోసం ఏర్పాటు చేసిన ప్రదర్శనను తిలకించడంతోపాటు పలువురు యువ ఓటర్లను, రాష్ట్రస్థాయి ప్రభావశీలురు తదితరులతో మాటామంతి నిర్వహిస్తారు. ఆ తర్వాత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డిజిపిలతో సమావేశం అవుతారు.

Read more RELATED
Recommended to you

Latest news