మోదీ పర్యటనలో ప్రొటోకాల్ వివాదం.. టీఆర్ఎస్ వ్యాఖ్యలపై కేంద్రం ఫైర్

-

రామగుండం ఎరువుల కర్మాగారాన్ని జాతికి అంకితం చేసే కార్యక్రమం విషయంలో కేంద్రం ప్రొటోకాల్‌ పాటించలేదని, సీఎం కేసీఆర్‌ను నామమాత్రంగా ఆహ్వానించారంటూ టీఆర్ఎస్ చేసిన ప్రకటనను కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ ఖండించింది. సీఎంకు ఆహ్వానం పలుకుతూ కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ ఈ నెల 2నే లేఖ రాశారంటూ దాన్ని విడుదల చేసింది.

రామగుండం ఎరువుల కర్మాగారంపై సీఎం కేసీఆర్‌ మరోసారి అసత్యాలు ప్రచారం చేస్తున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఇన్‌ఛార్జి తరుణ్‌ చుగ్‌ విమర్శించారు. కేసీఆర్‌ కేంద్రమంత్రిగా ఉన్నప్పుడే ఈ ఫ్యాక్టరీ మూతపడిందని, దానిని తెరిపించేందుకు ఆయన కానీ, అప్పటి ప్రభుత్వం కానీ ఏమీ చేయలేదని ఆరోపించారు.

‘‘ఎరువుల కర్మాగారాన్ని జాతికి అంకితమిచ్చేందుకు ప్రధాని రామగుండానికి వస్తుంటే ముఖ్యమంత్రి కేసీఆర్‌, కొత్త మిత్రులు సీపీఐ, సీపీఎంలతో కలిసి సమస్యలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. తెలంగాణకు కేంద్రం ఏం చేసిందో చెప్పాలని కేసీఆర్‌ అంటున్నారు. రాష్ట్రంలో జాతీయ రహదారుల నిడివిని రెట్టింపు చేశాం. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే ప్రతి కార్యక్రమంలోనూ కేంద్ర భాగస్వామ్యం ఉంది. ’’ అని తరుణ్‌చుగ్‌ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news