చంద్రబాబు- నితీష్ కేంద్రంలో చక్రం తిప్పుతున్నారు.. కేసీఆర్ కి టైమ్ వస్తుంది : కేటీఆర్

-

చంద్రబాబు- నితీష్ కేంద్రంలో చక్రం తిప్పుతున్నారు.. కేసీఆర్ కి కూడా తప్పకుండా  టైమ్ వస్తుందని  బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్  కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ 8, బీజేపీ కి 8 సీట్లు వచ్చాయి. మనకు సున్నా సీట్లు వచ్చినా భయపడలేదు. మళ్లీ దేశంలో కేసీఆర్ చక్రం తిప్పే రోజు తప్పకుండా వస్తుందని జోస్యం చెప్పారు. నాడు 369 కోట్ల రెవెన్యూ మిగులుతో అధికారంలోకి వస్తే.. మనం దిగిపోయే నాడు 5వేల 564 కోట్ల మిగులుతో కాంగ్రెస్ కి అప్పజెప్పామని తెలిపారు.

రెవెన్యూ మిగులు విషయంలో సీఎంది ఒక మాట, డిప్యూటీ సీఎంది మరో మాట అని ఎద్దేవా చేసారు. పదేళ్లలో 4లక్షల 17వేల కోట్లు అప్పు చేస్తే.. కాంగ్రెస్ ఏడాదిలోనే 1లక్ష 37వేల కోట్లు అప్పు చేసిందని తెలిపారు.కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పుల వల్ల ప్రజలకు ఏం జరిగిందో చెప్పాలని డిమాండ్ చేశారు. హైడ్రా పేరిట పేదల పొట్ట కొట్టడం తప్పా చేసింది ఏం లేదని మండిపడ్డారు. రాష్ట్రాన్ని నిలువునా దోచుకొని ఢిల్లీకి మూటలు పంపుతున్నారని ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Latest news