ఒకే వేదిక‌పై చంద్ర‌బాబు, రేవంత్‌..!

-

ప్రపంచ కమ్మ మహాసభకు హైదరాబాద్ కు వేదిక కానుంది. కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జులై 20, 21 తేదీలో తొలి ప్రపంచ కమ్మ మహాసభ హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీ లో నిర్వహిస్తున్నట్లు సంస్థ వ్యవస్థాపకులు జెట్టి కుసుమకుమార్ వెల్లడించారు. ఈ మహాసభకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిలు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొంటారని కుసుమ కుమార్ వెల్లడించారు.

కాగా ఇటీవల ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చి చంద్రబాబు సీఎం అయ్యారు. అయితే.. చంద్రబాబు ప్రమాణస్వీకార కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరు అవుతారని అందరు అనుకున్నారు. కానీ, రాజకీయ కారణాల వల్ల రేవంత్ రెడ్డి చంద్రబాబు ప్రమాణస్వీకారానికి హాజరు కాలేదు. దాదాపు పదేళ్ల తరువాత ఇద్దరు సీఎం హోదాలో కలుసుకోనుండటం గమనార్హం. రేవంత్ రెడ్డి తొలుత టీడీపీ హయాంలోనే కోడంగల్ ఎమ్మెల్యే విజయం సాధించారు. టీడీపీలో కీలక పాత్ర పోషించిన రేవంత్ రెడ్డి రాజీనామా చేసి కాంగ్రెస్ చేరారు. అంచెలంచెలుగా ఎదుగుతూ.. సీఎంగా బాధ్యతలు చేపట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news