బిగ్ బాస్ షో లో పేరు తో మోసం.. బిగ్ బాస్ లో అవకాశం ఇప్పిస్తానని మోసం చేసిన కేటుగాళ్లు. ఇక వివరాలను చూస్తే… బిగ్ బాస్ షో లో ఛాన్స్ ఇప్పిస్తామని జూనియర్ ఆర్టిస్ట్ లు, యాంకర్ల నుండి లక్షలు దోచుకున్నారు తమ్మలి రాజు, సత్య. యాంకర్ స్వప్న చౌదరి దగ్గర నుండి 2.5 లక్షలు తీసుకున్నట్టు సమాచారం. బిగ్ బాస్ సీజన్ -7 లో అవకాశం అంటూ ఆమె ని మోసం చేసారు. సీజన్ స్టార్ట్ అయినా తన పేరు లేకపోవడంతో రాజును నిలదీసిన స్వప్న చౌదరి. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుందని ఆమె ని రాజు నమ్మించాడు.
దీనితో సీజన్ అయిపోయే వరకు స్వప్న చౌదరి చూసింది. తర్వాత బెదిరించాడు రాజు. మా టీవీ లో పని చేస్తున్నారు సత్య, తమ్మలి రాజు. రాజు మోసాలకు పాల్పడుతున్నాడు అని మా టీవీ సిబ్బందికి తెలిసింది. ఉద్యోగంలో నుంచి రాజు ని తీసేసారు. రాజు, సత్య పై జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసారు. రాజు, సత్య పరారీలో వున్నారు.