ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘన విజయం సాధించి.. నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో ఏపీ సీఎంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు భాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు రాష్ట్రాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ క్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో ఇవాళ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పలువురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్నటువంటి పలు హైవేల నిర్మాణంపై చర్చించారు. ఈ క్రమంలో అనంతపురం అమరావతి, హైదరాబాద్-అమరావతి హైవేల నిర్మాణం త్వరితగతిన సాకారమయ్యేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రిని కోరినట్టు సమాచారం. కేంద్ర మంత్రులు కింజరాపు రామ్మోహనాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, శ్రీనివాస వర్మ, రాష్ట్ర ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ తో పాటు పలువురు ఎంపీలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. మరోవైపు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షాలను భేటీ అయ్యారు.