తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఉన్న పలు కర్పొరేషన్లకు చైర్మెన్లును నియమించారు. ఇప్పటి వరకు ఖాళీగా ఉన్న మూడు కార్పొరేషన్లు కు చైర్మెన్లను నియమిస్తు.. సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఎడ్యుకేషన్ వెల్పేర్ వసతుల కార్పొరేషన్ తో పాటు తెలంగాణ రాష్ట్ర రోడ్స్ డెవలప్ మెంట్ కార్పొరేషన్, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్లకు చైర్మెన్ల ను నియమించారు. కాగ తెలంగాణ ఎడ్యుకేషన్, వెల్ఫేర్ వసతుల కార్పొరేషన్ చైర్మెన్ గా రావుల శ్రీధర్‌రెడ్డి ని సీఎం కేసీఆర్ నియమించారు.
అలాగే తెలంగాణ రోడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా మెట్టు శ్రీనివాస్ ను సీఎం కేసీఆర్ నియమించారు. అలాగే తెలంగాణ రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా ఇంతియాజ్ ఇషాంక్ సీఎం కేసీఆర్ నియమించారు. కాగ ఆయా కార్పొరేషన్లు గత కొద్ది రోజుల నుంచి ఖాళీగా ఉన్నాయి. అలాగే సీఎం కేసీఆర్ ప్రస్తుతం.. టీఆర్ఎస్ పార్టీపై ప్రభుత్వ పని తీరుపై ఫోకస్ పెట్టారు. అందులో భాగంగానే.. ఈ మూడు కర్పొరేషన్లకు చైర్మెన్లను నియమించారు.