తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బిగ్ గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 30,453 ఉద్యోగాలను భర్తీ చేయడానికి ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. ఈ ఉద్యోగాలను భర్తీ చేయడానికి కేసీఆర్ సర్కార్ అనుమతి ఇచ్చింది. అంతే కాకుండా.. 30,453 ఉద్యోగాలను భర్తీ చేయడానికి తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ కూడా అనుమతి ఇచ్చింది. అంతే కాకుండా.. ఈ ఉద్యోగాలను భర్తీ చేయాలని సంబంధీత శాఖలకు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులను కూడా జారీ చేసింది.
కాగ గత కొద్ది రోజుల క్రితం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. అసెంబ్లీలో భారీగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నామని ప్రకటించిన విషయం తెలిసిందే. అసెంబ్లీలో సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన మేరకు నేడు రాష్ట్ర ఆర్థిక శాఖ 30,453 ఉద్యోగాలను భర్తీ చేయాలని సంబంధిత శాఖలకు ఉత్తర్వులను జారీ చేసింది. కాగ చాలా ఏళ్లు నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులు.. ఉద్యోగాల భర్తీ ప్రకటన కోసం వేచి చూస్తున్నారు. కాగ ఇన్ని రోజులకు నిరుద్యోగుల కోరిక తీరింది.