వరి సాగులో పంజాబ్ ను దాటేసాం….3 కోట్ల టన్నులు చేరాం – సీఎం కేసీఆర్

-

వరి సాగులో పంజాబ్ ను దాటేసాం….3 కోట్ల టన్నులు చేరామన్నారు సీఎం కేసీఆర్. గడిచిన 9 ఏళ్ళుగా ఎన్ని కష్టాలనైనా అధిగమిస్తూ, అమలు చేసిన కార్యాచరణ విప్లవాత్మక ఫలితాలను అందిస్తున్నది. పంజాబ్ వంటి రాష్ట్రాలను వెనక్కు నెట్టి నేడు తెలంగాణ రాష్ట్రంలో వరి ధాన్యం ఉత్పత్తి 3 కోట్లకు పైగా టన్నులకు చేరుకోవడం వెనుక ఎంతో కృషి దాగి ఉన్నదని చెప్పారు.

ఇప్పటికే ఇంత ఘనమైన ఉత్పత్తిని సాధించిన తెలంగాణ మరికొద్ది రోజుల్లో ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పాలమూరు ఎత్తిపోతల, నల్గొండ జిల్లా బ్రాహ్మణవెల్లెంల, డిండి, సిద్దిపేటలోని గౌరవవెల్లి, ఖమ్మం జిల్లా సీతారామ, సిరిసిల్ల మల్కపేట, అచ్చంపేట ఉమామహేశ్వర వంటి ప్రాజెక్టులు పూర్తికానున్నాయని వెల్లడించారు. అప్పుడు వరి ధాన్యం దిగుబడి తెలంగాణ రాష్ట్రంలో మరింతగా పెరుగనున్నది. అంచనాలకు మించి పెరుగుతున్న వరి ధాన్యపు మిల్లింగ్ సామర్థ్యాన్ని తదనుగుణంగా పెంచుకోవాల్సి ఉన్నదన్నారు. ప్రస్తుతం సిఎంఆర్ మిల్లింగ్ ద్వారా రాష్ట్రంలో వరి ధాన్యాన్ని బియ్యంగా మార్చే రైస్ మిల్లుల కెపాసిటి 75 లక్షల టన్నులకు మించి లేదు. దాంతో తెలంగాణ రైతు పండించిన వరి ధాన్యం మిల్లుల్లో నిల్వలు పెరుకుపోతున్నాయన్నారు.

అధిక నిల్వలతో తరువాత పంటకు నిల్వ స్థానం లేకుండా పోతున్నది. ధాన్యాన్ని మిల్లాడించే పరిస్థితి డిమాండ్ కు తగ్గట్టు లేకపోవడం, పండిన పంటకు, రైస్ మిల్లుల సామర్థ్యానికి విపరీతమైన వ్యత్యాసం ఉండడం వల్ల రైతులు ఇబ్బంది పడే పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఈ పరిస్థితుల నుండి రైతును గట్టెక్కించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది.’’ అని సిఎం కేసీఆర్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news