BREAKING : తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. పోడు భూములకు కూడా రైతు బంధు ఇస్తామని సీఎం కేసీఆర్ వెల్లడించారు. పోడు సమస్యకు శాశ్వత పరిష్కారంగా గిరిజనులకు తెలంగాణ ప్రభుత్వం భూములపై హక్కులు కల్పిస్తున్నదని… జూన్ 24 నుంచి పోడు పట్టాల పంపిణీకి ప్రభుత్వం శ్రీకారం చూడుతున్నామని ప్రకటన చేశారు.
అటవీ భూములపై ఆధారపడిన ఒక లక్షా యాభైవేల మంది ఆదివాసీ, గిరిజనులకు నాలుగు లక్షల ఎకరాల పోడు భూములపై యాజమాన్య హక్కులు కల్పిస్తున్నది. దీనికి రైతుబంధు పథకం వర్తించేలా చర్యలు తీసుకుంటుందని చెప్పారు సీఎం కేసీఆర్. పేద వారైన అర్హులకు ఇండ్ల స్థలాల పంపిణీ చేస్తామని వెల్లడించారు. గ్రామాల్లో నివాస యోగ్యమైన ప్రభుత్వ భూముల్లో అర్హులకు ఇండ్ల స్థలాల పంపిణీ చేస్తామని ప్రకటన చేశారు సీఎం కేసీఆర్. తెలంగాణ దశాబ్ది వేడుకల వేళ ఆదివాసీ గిరిజనుల చిరకాల ఆకాంక్షను తెలంగాణ ప్రభుత్వం తీరుస్తున్నదని తెలియజేయడానికి నేనెంతో సంతోషిస్తున్నానని వివరించారు.