రాష్ట్ర ఆర్దిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు నేడు హుస్నాబాద్ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో హుస్నాబాద్ మండలం పొట్లపల్లి గ్రామంలో సీతారామచంద్రస్వామి ఆలయాన్ని సందర్శించిన హరీష్ రావు స్వామివారిని దర్శించుకుని.. 40 లక్షల నిధులతో అలయ పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బిఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ నిఖార్సైన హిందువు కాబట్టే రాష్ట్రంలోని దేవాలయాలను అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు.
1200 కోట్లతో యాదాద్రి టెంపుల్, 600 కోట్లతో కొండగట్టు, అర్చకులకు జీతాలు, ఆలయాల అభివృద్ధి కోసం చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వమేనని అన్నారు. కెసిఆర్ హయాంలో గత తొమ్మిది సంవత్సరాల నుండి గుంట కూడా ఎండకుండా పంటలు పండుతున్నాయన్నారు హరీష్ రావు. హుస్నాబాద్ ప్రాంత ప్రజల చిరకాల కోరిక అయిన గౌరవెల్లి ప్రాజెక్టు కట్టి నీళ్ళు ఇచ్చింది కేసీఆర్ అని స్పష్టం చేశారు.