దివ్యాంగులు, టెకేదార్లకు సీఎం కేసీఆర్‌ శుభవార్త..నేటి నుంచే ఫించన్లు

-

దివ్యాంగులు, టెకేదార్లకు సీఎం కేసీఆర్‌ శుభవార్త చెప్పారు. నేటి నుంచే ఫించన్లు అమలు కానున్నాయి.నేడు మెదక్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా మెదక్ జిల్లా BRS పార్టీ కార్యాలయం, జిల్లా సమీకృత కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలను ప్రారంభించనున్నారు తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్.

ఇక ఈ పర్యటనలో భాగంగా రోడ్డు మార్గాన హైదరాబాద్ లోని ప్రగతి భవన్ నుంచి గుమ్మడిదల, నర్సాపూర్, కౌడిపల్లి మీదుగా మెదక్ చేరుకోనున్నారు సీఎం కేసీఆర్‌. ఇక మెదక్ CSI చర్చి గ్రౌండ్ లో లక్ష మందితో ప్రగతి శంఖారావం సభలో పాల్గొంటారు. అనంతరం దివ్యంగులకు రూ. 3116 నుంచి రూ. 4116 కు పెంచిన పింఛన్ ని పంపిణీ చేయనున్నారు సీఎం కేసీఆర్. అలాగే.. టెకేదార్ బీడీ కుల వృత్తుల కార్మికులకు పింఛన్ పంపిణీ చేయనున్నారు సీఎం కేసీఆర్‌. ఈ మేరకు మంత్రి హరీష్‌ రావు అన్ని ఏర్పాటు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news