నేను మహారాష్ట్రలో కాలు పెట్టాక విద్యుత్ కోతలు ఎత్తేసారు – సీఎం కేసీఆర్

-

నేను మహారాష్ట్రలో కాలు పెట్టాక విద్యుత్ కోతలు ఎత్తేసారని తెలిపారు సీఎం కేసీఆర్. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని బిఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో సుభిక్షంగా వర్ధిల్లుతున్న తెలంగాణ రాష్ట్రంలా తమ రాష్ట్రం ప్రగతిబాట పట్టాలని మహారాష్ట్ర నాయకులు, యువత, రైతులు బలంగా కోరుకుంటున్నారు. ఈ క్రమంలో సోమవారం తెలంగాణ భవన్ లో బిఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సమక్షంలో సోలాపూర్ నియోజకవర్గ గ్రామ సర్పంచులు బిఆర్ఎస్ పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా బిఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మాట్లాడుతూ…మహారాష్ట్ర గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు చాలా వింతగా అనిపిస్తుంటుంది. దేశ ఆర్థిక రాజధానిగా ఖ్యాతిగాంచిని ముంబాయి తో పాటు మరెన్నో పెద్ద పెద్ద నగరాలు,పరిశ్రమలు, సహజవనరులు కలిగిన మహారాష్ట్రలో సంపదకు కొదువ లేదు. ఎన్నో నదులు మహారాష్ట్రలో పుడుతున్నాయి. పెద్ద నదులైన గోదావరి, కృష్ణా నదులు మహారాష్ట్రలో పుట్టి, అక్కడి నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ల మీదుగా ప్రయాణిస్తూ సముద్రంలో కలుస్తాయి. పంచగంగ, వెన్ గంగ, మూల, ప్రవర, వార్దా వంటి రెండు డజన్లకు పైగా నదులు మహారాష్ట్రలో ప్రవహిస్తున్నాయి. కానీ మహారాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు త్రాగడానికి సరిపడా నీళ్ళు లేవన్నారు. మహారాష్ట్రలో ఎన్నో చోట్ల 20,22, 25 గజాల లోతున ఉన్న నీటి కోసం అక్కాచెల్లెల్లు తాళ్ళతో బావుల్లోకి దిగుతూ ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారనే సంఘటనలను నేను సోషల్ మీడియాలో గమనిస్తున్నాను. ఇలాంటి దుస్థితి ఎందుకుందో అక్కడి ప్రజలు ఆలోచన చేయాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news