పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై నేడు సీఎం కేసీఆర్ సమీక్ష

-

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నిర్మాణంలో వేగం పుంజుకుంది. ఇటీవలే ఈ ప్రాజెక్టులో కీలక అడుగు ముందుకు పడింది. ఈ ప్రాజెక్టులో కీలకమైన నార్లాపూర్ పంప్​హౌస్ డ్రై రన్ విజయవంతం అయిన సంగతి తెలిసిందే. తాజాగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు.

ఈరోజు మధ్యాహ్నం సచివాలయంలో మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఇంజినీర్లతో సీఎం సమావేశం కానున్నారు. ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని అంశాలపై విస్తృతంగా చర్చించనున్నారు. ప్రాజెక్టుకు సంబంధించి ఇటీవలే డ్రైరన్ విజయవంతం కాగా వెట్ రన్‌కు సిద్ధం చేస్తున్నారు. త్వరలోనే ప్రాజెక్టు ప్రారంభానికి ప్రభుత్వం సిద్దమవుతోంది.

ఈనెల 15వ తేదీ లేదా 17వ తేదీల్లో ప్రారంభోత్సవం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. కరివెన జలాశయం వరకూ నీటిని తరలించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ పరిస్థితుల్లో ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ సమీక్షించనున్నారు. అక్కడక్కడా పూర్తి చేయాల్సిన పనులు, క్షేత్రస్థాయి ఇబ్బందులపై సీఎం దృష్టి సారించనున్నారు. కాల్వల నిర్మాణానికి సంబంధించిన ప్రక్రియ కూడా ప్రారంభం కాగా ఆయా అంశాలపై కూడా ముఖ్యమంత్రి సమీక్షించి నిర్ణయాలు తీసుకోనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news