తెలంగాణ నిరుద్యోగులకు సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. నిన్న సీఎం వనపర్తి జిల్లాలో పర్యటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ పర్యటనలో మన ఊరు – మన బడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సీఎం కేసీఆర్ అనంతరం బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పారు. నిరుద్యోగులు అంతా రేపు ఉదయం పది గంటల సమయంలో టీవీలు చూడాలని కోరారు సీఎం కేసీఆర్.
తాను రేపు అసెంబ్లీలో 10 గంటలకు కీలక ప్రకటన చేయబోతున్నానని… ఆయన వెల్లడించారు. దీంతో తెలంగాణ నిరుద్యోగుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. అయితే సీఎం కేసీఆర్ రేపు ఉద్యోగాల భర్తీపై ప్రకటన చేస్తారా ? లేక నిరుద్యోగ భృతిపై ప్రకటన చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. ప్రాథమిక సమాచారం ప్రకారం ఉద్యోగాల భర్తీపై సీఎం కేసీఆర్ ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఇవాళ 60 వేల ఉద్యోగాల భర్తీపైనే కేసీఆర్ ప్రకటన చేసే అవకాశం ఉంది. దీనిపై క్లారిటీ రావాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే.