భారీ వర్షాలపై సీఎం కేసీఆర్‌ కీలక ఆదేశాలు..ప్రాణ నష్టం లేకుండా చూడండి !

-

తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. అతి భారీ వర్షాల నేపథ్యంలో అత్యవసర చర్యలపై మంత్రులు, అధికారులను అప్రమత్తం చేస్తున్నారు తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్. రెండు రోజులుగా సీఎం కేసీఆర్ ఆదేశాలతో క్షేత్రస్థాయిలో మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పనిచేస్తున్నారు.

ప్రాణనష్టం జరగకుండా చూడాలని మంత్రులకు సీఎం కేసీఆర్ ఆదేశించారు. సహాయ చర్యల కోసం క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగాన్ని అందుబాటులో ఉంచాలని సీఎస్ శాంతి కుమారికు సీఎం కేసీఆర్‌ దిశానిర్దేశం చేశారు. భారీ వరదల నుంచి ప్రాజెక్టుల వద్దే ఉంటూ సమయస్ఫూర్తితో వ్యవహరిస్తూ నీటిని కిందకి వదలాలని ఈఎన్సీలకు, చీఫ్ ఇంజనీర్లకు కేసీఆర్ ఆదేశాలు ఇచ్చారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version