ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో జోరు సాగిస్తున్నారు. వరుసగా సభలు, సమావేశాలు నిర్వహిస్తూ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు. ఇందులో భాగంగానే రాష్ట్రంలో ఎంపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేస్తూ ఆయా నియోజకవర్గాల పర్యటనలతో బిజీబిజీగా ఉన్నారు. అయితే ఆయన కేవలం తెలంగాణలోనే కాదు.. రేవంత్ రెడ్డి ఛరిష్మా ఇతర రాష్ట్రాల్లోనూ కనిపిస్తోంది. ఆయన పాపులారిటీని వినియోగించుకోవాలని భావించిన హైకమాండ్ రేవంత్‌తో ఇతర రాష్ట్రాల్లోనూ ప్రచారం చేయిస్తోంది.
ఇటీవలే కేరళలో పర్యటించిన రేవంత్ అక్కడ లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఇక ఇవాళ కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వెళ్లనున్నారు. ఈరోజు మెదక్ జిల్లాలో పర్యటించనున్న సీఎం.. అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు నామినేషన్ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం సాయంత్రం అక్కడి నుంచి బయల్దేరి కర్ణాటకకు వెళ్తారు. ఇక ఆ రాష్ట్రంలో సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో కలిసి లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. కర్ణాటకలో తెలుగు మాట్లాడే నియోజకవర్గాల్లో రేవంత్ ప్రచారం చేయనున్నారు.