ఓటమి ఒకరి ఖాతాలో.. గెలుపు నా ఖాతాలో వేసుకునే వ్యక్తిని కాదు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్ర సమస్యలు పరిష్కరించడమే తన మెుదటి బాధ్యత అని తెలిపారు. తాను జిల్లాకు ముఖ్యమంత్రిని కాదని రాష్ట్రానికి సీఎం అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర చీఫ్ గా గెలుపు ఓటములకు తానే బాధ్యుడినన్న రేవంత్.. తన జిల్లా మహబూబ్నగర్లో ఎంపీ సీటు కోల్పోవడానికి , ఓటమి చవి చూడటానికి తనదే బాధ్యత అని అన్నారు. వచ్చిన ఫలితాలు ఉగాది పచ్చడిలాంటివిని.. రాష్ట్రానికి పరితమైన నాయకుణ్ణి కాబట్టి తన బాధ్యత రాష్ట్రానికే పరిమితం అని తెలిపారు.
“కేసీఆర్ బీజేపీతో బేరసారాలు చేసుకుంటున్నారు. కేసీఆర్ అవయవదానం చేసి కమలం పార్టీని గెలిపించారు. మోదీ గ్యరంటీని ప్రజలు తిరస్కరించారు. కేసీఆర్ ఉన్నంత కాలం కుట్రలు, కుతంత్రాలు ఉంటాయి. మా ప్రభుత్వాన్ని పడగొట్టే కుట్ర జరుగుతున్నాయనే అనుమానాలున్నాయి. పార్టీ సూచనల మేరకే నేను నడుచుకుంటాను. ఏపీలో ఏ ప్రభుత్వం వచ్చినా సామరస్యంగానే సమస్యలు పరిష్కరించుకుంటామని ముందే చెప్పాను.” అని రేవంత్ అన్నారు.