ఔటర్ టోల్ టెండర్ల పై విచారణకు సీఎం రేవంత్ ఆదేశం

-

హైదరాబాద్‌ అవుటర్‌ రింగ్‌ రోడ్డు టోల్‌ ట్యాక్స్‌ వసూలు టెండర్లలో జరిగిన అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ క్రమంలోనే ఈ వ్యవహారంలో సమగ్ర విచారణ చేపట్టాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆదేశించారు. హెచ్‌ఎండీఏపై సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన సీఎం ప్రభుత్వానికి రావాల్సిన భారీ ఆదాయానికి గండిపడేలా తక్కువ మొత్తానికి టెండర్లు కట్టబెట్టిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

కనీస ధర నిర్ణయించకుండా టెండర్లు ఎలా పిలిచారని అధికారులను ప్రశ్నించిన రేవంత్.. ‘అందులో ఎవరెవరి ప్రమేయముంది? ఏయే సంస్థలున్నాయి? బాధ్యులెవరు? అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాలని అధికారులను ఆదేసించారు. ఈ టెండర్లలో జరిగిన అవకతవకలు, అనుసరించిన విధానాలు, ఫైళ్లు కదిలిన తీరుపై పూర్తి వివరాలను అందజేయాల్సిన బాధ్యతను హెచ్‌ఎండీఏ జాయింట్‌ కమిషనర్‌ ఆమ్రపాలికి అప్పగిస్తున్నట్లు తెలిపారు. హెచ్‌ఎండీఏ నుంచి పూర్తి నివేదిక అందిన తర్వాత మంత్రివర్గంలో చర్చించి ఈ టెండర్ల వ్యవహారాన్ని సీబీఐ లేదా అదే స్థాయికి చెందిన మరో దర్యాప్తు సంస్థకు అప్పగిస్తామని సీఎం స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news