కుక్కల దాడిలో బాలుడి మృతి.. సీఎం రేవంత్‌రెడ్డి ఆవేదన

-

సికింద్రాబాద్లో కుక్కల దాడిలో బాలుడి మృతిపై సీఎం రేవంత్‌రెడ్డి స్పందించారు. బాలుడి మృతి కలిచివేసిందని అన్నారు. ఇలాంటి ఘటనలు పున‌రావృతం కాకుండా చ‌ర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వీధి కుక్కలపై ఫిర్యాదులు స్వీకరించడానికి టోల్‌ఫ్రీ నంబర్‌ ఏర్పాటు చేయాలని సూచించారు. పశు వైద్యులు బ్లూక్రాస్ వంటి సంస్థల ప్రతినిధులతో కమిటీ ఏర్పాటు చేయాలని.. కుక్కలు దాడిచేస్తే జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని ఆసుపత్రుల్లో తక్షణం వైద్యం అందించాలని ఆదేశాలు జారీ చేశారు. కుక్కల నియంత్రణలో ఇతర రాష్ట్రాలు పద్ధతులను పరిశీలించాలని పేర్కొన్నారు.

సికింద్రాబాద్‌ జవహర్‌నగర్‌ పరిధిలోని వికలాంగుల కాలనీలో ఇంటి బయట ఆడుకుంటున్న రెండేళ్ల బాలుడిపై వీధికుక్కలు దాడి చేశాయి. బాలుడి తల, శరీరం పై తీవ్ర గాయాలు కావడంతో గాంధీ ఆసుపత్రికి తరలించారు. విహాన్‌ ఆరోగ్య పరిస్థితి విషమించి మృతి చెందాడు. శరీరమంతా ఇన్ఫెక్షన్ సోకి మరణించాడు. కుక్కల బెడద ఉందని అధికారులకు పలుమార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కుక్కల దాడిలో చాలా మంది పిల్లలు దాడికి గురయ్యారని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news