రాహుల్ గాంధీ ఇచ్చిన మాటను నెరవేర్చడమే మా కర్తవ్యం : రేవంత్ రెడ్డి

-

కులగణన సంప్రదింపుల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక కామెంట్స్సా చేసాడు. మాజిక, ఆర్ధిక, రాజకీయ, విద్య, ఉద్యోగ, ఉపాధి కుల గణన సర్వే ప్రభుత్వం బాధ్యతగా భావించింది. పౌరసమాజం నుంచి సూచనలు తీసుకోవడానికి రాహుల్ గాంధీ గారు ఇక్కడకు రావడం గొప్ప విషయం. ఈ నిర్ణయం తీసుకోవాలంటే గుండె ధైర్యం కావాలి. సామాజిక బాధ్యత, సమాన అవకాశాలు ఇవ్వాలన్న ఆలోచనతో రాహుల్ గాంధీ ఇక్కడకు వచ్చారు. మాటలు కాదు… చేతలతో చూపాలన్నది రాహుల్ గాంధీ ఆలోచన.

విద్య, వైద్యం, ఉద్యోగం, సామాజిక న్యాయం ప్రజలకు అందించాలని రాహుల్ గాంధీ అడుగు ముందుకు వేశారు. మనది రైజింగ్ తెలంగాణ. దేశానికి రాహుల్ గాంధీ ఇచ్చిన మాటను అమలు చేయడం మన కర్తవ్యం. కులగణన పూర్తి చేసి బీసీలకు న్యాయంగా అందాల్సిన రిజర్వేషన్లు అందిస్తాం. కులగణనను 2025 జనగణనలో పరిగణనలోకి తీసుకోవాలని ఈ వేదికపై తీర్మానం చేస్తున్నాం అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news