తెలంగాణ నిరుద్యోగులకు సీఎం రేవంత్‌ శుభవార్త..అన్ని శాఖల్లో ఖాళీలు భర్తీ !!

-

గ్రూప్ 1 మెయిన్స్ పై సీఎం రేవంత్‌ శుభవార్త చెప్పారు. త్వరలో గ్రూప్ 1 మెయిన్స్ నిర్వహించి.. ఫలితాలు విడుదల చేస్తామని వెల్లడించారు. దసరా పండుగ లోపే 11,062 డీఎస్సీ నియామకాలు చేస్తామని ప్రకటించారు సీఎం రేవంత్‌ రెడ్డి. తెలంగాణ డీఎస్సీ-2024 ఫలితాలు విడుదల అయ్యాయి. తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో డీఎస్సీ-2024 ఫలితాలను విడుదల చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

cm revanth reddy about group 2 mains

ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ… విద్యాశాఖ అధికారులు అతి తక్కువ సమయంలో ఫలితాల కోసం విశేష కృషి చేసారని.. 2,46,584 మంది డిఎస్సి 2024 పరీక్షలకు హాజరు అయ్యారన్నారు. 1:3 ప్రాతిపదికన ఫలితాలు విడుదల చేసామని… ఫైనల్ నియామకాలు దసరా పండుగ లోపు చేస్తామని వెల్లడించారు. 9.10.2024 లోపు సర్టిఫికెట్ వేరిఫికేషన్ చేసి ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు ఇస్తామని వెల్లడించారు. తెలంగాణలో దసరా పండుగ ప్రతీ ఒక్కరు ఘనంగా నిర్వహించుకుంటారని వెల్లడించారు. గత ప్రభుత్వం 7 వేల పైచిలుకు ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేశారు….డిఎస్సి నిర్వహణ చేయక పోవడం వల్ల పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని వివరించారు. అన్ని శాఖల్లోని భర్తీ కానీ పోస్టులను భర్తీ చేస్తామని… గతంలో పేరుకు పోయిన చెత్తను తొలగిస్తామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news