తెలంగాణ రాష్ట్రంలో టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ కి నవంబర్ లో నోటిఫికేషన్ ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు విద్యాశాఖ అధికారులు. దరఖాస్తుల ప్రక్రియతో పాటు ప్రిపరేషన్ కి మూడు నెలల సమయం ఇవ్వనున్నారు. జనవరి నెలలో టెట్ పరీక్షలు నిర్వహించిన తరువాత ఫిబ్రవరిలో మరో డీఎస్సీ నోటిఫికేషన్ వేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందుకు తాజాగా డీఎస్సీ ఫలితాల విడుదల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి త్వరలోనే అని ప్రకటించారు.
తాజాగా 11,062 పోస్టుల భర్తీకి నిర్వహించిన డీఎస్సీ ఫలితాలు విడుదలయ్యాయి. ఇటీవల విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ ప్రకారం.. మరోసారి టీచర్ల నియామక ప్రక్రియను చేపడుతామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. జాబ్ క్యాలెండర్ ప్రకారం.. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో డీఎస్సీ-2025 నోటిఫికేషన్ విడుదల కానుంది. ఉద్యోగాలు ప్రతీ ఏడాది నిరంతర ప్రక్రియలా కొనసాగుతుందని తెలిపారు. మరో 5వేల పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ వేస్తామని..తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేస్తామని పేర్కొన్నారు సీఎం రేవంత్ రెడ్డి.