ఓటు హక్కు వినియోగించుకున్న సీఎం రేవంత్ రెడ్డి

-

ఉమ్మడి మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో సీఎం రేవంత్ రెడ్డి తాజాగా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కొడంగల్ లోని ఎంపీడీఓ కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ఓటు వేశారు. కాగా కల్వకుర్తి ఎమ్మెల్యేగా ఎన్నికైన కసిరెడ్డి నారాయణ రెడ్డి తన ఎమ్మెల్సీ పదవీకి రాజీనామా చేశారు. దీంతో అక్కడ ఉప ఎన్నిక నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ నుంచి జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి నవీన్ రెడ్డి ప్రధానంగా పోటీ పడుతున్నారు.

కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పోటీ రసవత్తరంగా మారింది. స్థానిక సంస్థలు అధికంగా బీఆర్ఎస్ కి ఎక్కువగా ఉండటంతో బీఆర్ఎస్ గెలుస్తుందని బీఆర్ఎస్ అభ్యర్థి ధీమాలో ఉన్నాడు. క్రాస్ ఓటింగ్ తో తానే గెలుస్తానని.. రాష్ట్రంతో తమ పార్టీ అధికారంలో ఉందని.. తమకే ఓట్లు అధికంగా పడుతాయని ఆశిస్తున్నారు.జిల్లా వ్యాప్తంగా దాదాపు 100 శాతం పోలింగ్ జరిగింది.  మరీ మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవ్వరూ గెలుస్తారో వేచి చూడాలి మరీ.

Read more RELATED
Recommended to you

Latest news