ఖమ్మం గడ్డ కాంగ్రెస్ కు అడ్డా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఖమ్మం గడ్డ మీద నుంచే రెండు లక్షల రుణ మాఫీ గురించి హామీ ఇచ్చాం. సోనియాగాంధీ మాట ఇచ్చింది అంటే హామీ నెరవేర్చలసిందే. పట్టువదలకుండా భట్టి విక్రమార్క రైతు రుణ మాఫీ చేస్తున్నారు. ఎంత మంది అడ్డుపడ్డ, కాళ్ళకి అడ్డం పడ్డా హామీ నెరవేరుస్తన్నం. 18000 కోట్ల రూపాయలు 27 రోజుల్లో రైతులకి ఇచ్చం అని సీఎం రేవంత్ అన్నారు.
అలాగే హరీష్ రావు చీము నెత్తురు వుంటే.. సిగ్గు లజ్జ వుంటే రాజీనామా చేయ్యాలి.. నీది సిగ్గులేని జాతి. అమరవీరుల స్థూపం వద్దకు వచ్చి క్షమాపణ చెప్పు. నాలుగు లక్షల 50 వేల ఇళ్లను మంజూరు చేశాం. ఓరి సన్నాసి అసెంబ్లీ లో సీట్లు తగ్గితే పార్లమెంటులో గుండు సున్న ఇచ్చా. BRS పార్టీ బతుకు బస్ స్టాండ్ అయ్యింది. కానీ ఇప్పుడు ప్రజలనే దోషులుగా చేసే ప్రక్రియ చేస్తున్నారు అని సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు.