కృష్ణ నది జలాలు పారక పోతే గోదావరి జలాలు పంటలు సాగుకు ఇస్తాం అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రస్తుతం పది వేల కోట్లు సీతారామ ప్రాజెక్ట్ కి అవసరం. 2026 వరకు సీతారామ పూర్తి చేస్తాం. మాట ఇస్తున్నాము.. ఎన్ని వేల కోట్లు అవసరం అయిన ఇస్తాం.. ఏడు లక్షల ఎకరాలకు సాగు నీరు ఇస్తాం. మున్నేరు నది మీద 32 టిఎంసి రిజర్వాయర్ గ్రావిటీ ద్వారా ఇచ్చేందుకు కృషి చేస్తాం. వీరభద్రుడి పేరు మీద 15 TMCల రిజర్వాయర్ నిర్మాణం కూడా చేపడతాం. అయితే ఈ గొప్పతనం అంతా ఖమ్మం జిల్లాకే దక్కుతుంది అని రేవంత్ అన్నారు.
అలాగే ఈరోజు ఖమ్మం జిల్లాలో BRS కు ఏం లేదు. వాళ్ళు మారలేదు.. వాళ్ళకి సిగ్గులేదు. ఇప్పటికి అబద్దాల చెబుతూ బావ బావమరిది లు తిరుగుతున్నారు. అయితే ఈ BRS ను బద్దలు కొట్టే బాధ్యత నాది.. ఈ BRS ను బంగాళాఖాతం లో విసిరేసి బాధ్యత నాది అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.