‘రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం’ పథకాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

-

రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం’ పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి శనివారం ప్రారంభించారు. సివిల్స్ ప్రిలిమ్స్ పాసైన రాష్ట్ర అభ్యర్థులకు ఆర్థిక సాయానికి కొత్త పథకం దోహదపడనుంది. సింగరేణి ద్వారా ఆర్థిక సాయం అందించే పథకాన్ని కాంగ్రెస్ సర్కారు ఇవాళ ప్రారంభించింది. ప్రజాభవన్ లో ఈ పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం సివిల్స్, ప్రిలిమ్స్ పాసైన రాష్ట్ర అభ్యర్థులతో సీఎం రేవంత్ రెడ్డి ముఖాముఖి నిర్వహించారు.

cm

గతంలోనే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించబోయే గ్రూపు 1 పరీక్షలను రాయబోయే అభ్యర్థులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పిన విషయం తెలిసిందే. మెయిన్స్ పరీక్షలను రాయబోయే అభ్యర్థులందరికీ కూడా ఉచితంగా కోచింగ్ ఇవ్వాలని నిర్ణయించింది. ఉచిత కోచింగ్ తో పాటు ప్రతి నెల రూ.5000 చొప్పున మొత్తాన్ని స్టైపెండ్ గా అందించనుంది. హైదరాబాద్ లోని సైదాబాద్ లక్ష్మీనగర్ కాలనీ రోడ్డు నెంబర్ 08, ఖమ్మంలోని బీసీ స్టడీ సర్కిళ్లలో ఈ ఉచిత కోచింగ్ కొనసాగుతుంది. 75 రోజుల పాటు అందుబాటులో ఉంటుంది. ఈ స్టడీ కాలంలో నెలకు రూ.5వేలు స్టెపెండ్ చెల్లిస్తారు. దీనికి దరఖాస్తు గడువు నిన్నటితో ముగిసిపోయింది.

Read more RELATED
Recommended to you

Latest news